2018లో గూగుల్‌లో ఎక్కువగా దేని గురించి వెతికారో తెలుసా?

Wed,December 12, 2018 05:30 PM

Google Reveals The Uplifting Word That The World Searched For In 2018

గూగుల్.. ఇంటర్నెట్‌లో ఏ సమాచారం కావాలన్నా మనం ఆధారపడేది దీని మీదే. స్మార్ట్‌ఫోన్, కాసింత టెక్నాలజీ తెలిస్తే చాలు.. గూగుల్‌లో వెతకొచ్చు. దాని ఫీచర్లు కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అందుకే.. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధికంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తారు. తాజాగా గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌కు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. ఇంతకీ ఏంటా వీడియో అంటే.. 2018లో గూగుల్‌లో ఎక్కువగా దేని గురించి యూజర్లు వెతికారు.. అనే దాని మీద ఈ వీడియోను రిలీజ్ చేసింది గూగుల్. 'ఇయర్ ఇన్ సెర్చ్' పేరుతో ఈ వీడియోను రిలీజ్ చేసింది. అయితే.. ఎక్కువగా ఏ పదం గురించి యూజర్లు గూగుల్‌లో వెతికారు తెలుసా? 'గుడ్'.. అవును.. గుడ్ అనే పదంతో ఉన్న వాక్యాలనే ఎక్కువగా యూజర్లు సెర్చ్ చేశారట.

మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. గుడ్ థింగ్స్ ఇన్ ది వరల్డ్, హవ్ టు బి ఏ గుడ్ సిటిజన్, గుడ్ సింగర్, ఏ గుడ్ కిస్సర్, వాట్ మేక్స్ ఏ గుడ్ ఫ్రెండ్, ఏ గుడ్ రోల్ మోడల్.. ఇలా గుడ్ అనే పదం యూజర్లు వెతికిన వాక్యాల్లో ఉందట. వాళ్లు దేని గురించి వెతికారో.. వాటిలో బెస్ట్ క్లిప్పింగ్స్‌ను వీడియోగా తయారు చేసింది గూగుల్. ఇక.. ఆ వీడియోను షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాదు.. ఆ వీడియోను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. యూట్యూబ్ ఇయర్ ఎండ్ రివైండ్ వీడియో కన్నా ఇదే సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
5896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles