ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులు షట్‌డౌన్!

Fri,October 12, 2018 10:43 AM

Global Internet Shutdown Likely Over Next 48 Hours

న్యూయార్క్: రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలకమైన డొమైన్ సర్వర్లకు మెయింటనెన్స్ పనులు జరగనుండటంతో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోవచ్చని రష్యా టుడే వెల్లడించింది. ఈ మెయింటనెన్స్ పనుల్లో భాగంగా కొద్ది సేపు పూర్తిగా నెట్‌వర్క్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సైబర్ దాడులు పెరిగిపోతున్న సమయంలో ఇంటర్నెట్ అడ్రెస్ బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్‌ఎస్)కు భద్రత కల్పించడంలో భాగంగా ది ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐసీఏఎన్‌ఎన్) ఈ పని చేపడుతున్నది. ఇందులో భాగంగా డీఎన్‌ఎస్‌కు రక్షణ కల్పించే క్రిప్టోగ్రాఫిక్ కీను మార్చనున్నారు.

డీఎన్‌ఎస్ స్థిరంగా, భద్రంగా ఉండాలంటే ఇంటర్నెట్ షట్‌డౌన్ తప్పనిసరి అని కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (సీఆర్‌ఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మార్పునకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సిద్ధంగా లేకపోతే వాళ్ల కస్టమర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని స్పష్టంచేసింది. దీంతో రానున్న 48 గంటల్లో ఆన్‌లైన్ లావాదేవీలు, ఇతర ఇంటర్నెట్ సర్వీసులకు ఇబ్బందులు తప్పవని సీఆర్‌ఏ తెలిపింది. ఇక ఔట్‌డేటెడ్ ఐఎస్‌పీ వాడుతున్న యూజర్లకు కూడా గ్లోబల్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది ఉంటుందని ఆ ప్రకటనలో చెప్పింది.

5971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS