తండ్రి కారు డ్రైవింగ్ చేస్తుంటే.. కూతురు కారు మీదికెక్కింది.. వీడియో

Mon,May 21, 2018 05:10 PM

Girl student did homework on roof of moving taxi in china

అది చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లోని సాంగ్‌క్యూ సిటీ. ఓ తండ్రి తన కూతురును స్కూల్‌లో దింపడానికి తన ట్యాక్సీలో తీసుకెళ్తున్నాడు. అయితే.. ఆ అమ్మాయి ఇంకా తన హోమ్ వర్క్ ను పూర్తి చేయలేదు. హోమ్ వర్క్ పూర్తి చేయకుంటే టీచర్లు చితకబాదుతారు. ఏం చేయాలి? ఏం చేయాలి? అని టెన్షన్ పడింది. ఇంతలోనే ఓ మంచి ఐడియా తట్టింది తనకు. తండ్రి కారును డ్రైవ్ చేస్తుంటే.. వెనక సీట్లో కూర్చున్న కూతురు డోర్ అద్దం ఓపెన్ చేసి ఏం చక్కా పైకి లేచింది. కారు టాప్ మీద నోట్‌బుక్ పెట్టి టకటకా తన హోమ్‌వర్క్ (కార్‌వర్క్)ను పూర్తి చేసింది.

అయితే.. తండ్రి ఈ అమ్మాయి చేసిన వింత పనిని చూడలేదు. డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు తప్పితే తన కూతురు ఏం చేస్తున్నదనే విషయాన్ని పట్టించుకోకపోవడంతో అడ్డంగా బుక్కయిపోయాడు. ఎలా అంటే.. రోడ్డు మీద వెళ్తున్న కొంతమంది ఈవిచిత్రమైన ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక.. ఈ విషయం కాస్త రవాణా శాఖ అధికారులను తెలియడంతో మనోడి లైసెన్స్‌ను క్యాన్సిల్ చేశారట. అంతే కాదు ట్యాక్సీ ఓనర్ కూడా ఆ అమ్మాయి తండ్రిని జాబ్ నుంచి పీకేశాడట. తీసేయరా మరి.. అలా కారు వెళ్తుండగా కారు అద్దం ద్వారా బయటికి రావడం కరెక్ట్ కాదు కదా. ఏదైనా వాహనం ఆ అమ్మాయిని ఢీకొంటే.. ఇంకేమైనా ఉందా.. మాకంపెనీకి చెడ్డ పేరు కదా. అతడు అన్నీ గమనించాలి కదా.. అనేది ట్యాక్సీ ఓనర్ వాదన.

3734
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS