పాండాల ఎన్ క్లోజర్ లో పడ్డ బాలిక..వీడియో

Mon,February 11, 2019 04:57 PM

Girl Falls Into Panda Enclosure in china here the vedio

ఏదైనా జూపార్కుకు వెళ్లినపుడు అక్కడ ఏర్పాటు చేసిన సూచనలు పాటించకపోతే మాత్రం ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. చైనాలో ఓ జూ పార్కుకు వెళ్లిన బాలిక తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. చెంగ్దులోని పాండా బ్రీడింగ్ రీసెర్చ్ బేస్ కేంద్రానికి సందర్శకులు వెళ్లారు.

సందర్శకులంతా ఎన్ క్లోజర్ పై నుంచి పాండాలను చూస్తుండగా..ఎనిమిదేళ్ల బాలిక ఎన్ క్లోజర్ వద్దనున్న నిషేధిత స్థలంలోకి వెళ్లి..ప్రమాదశాత్తు ఎన్ క్లోజర్ లో చుట్టూ ఏర్పాటు చేసిన కందకంలో పడిపోయింది. కందకం అటువైపు నుంచి మూడు పాండాలు బాలికవైపు వచ్చాయి. పాండాలు తనవైపే చూస్తుంటే ఆ బాలిక భయంతో వణికిపోయింది. రీసెర్చ్ సెంటర్ సెక్యూరిటీ గార్డు అప్రమత్తమై వెంటనే ఓ ఇనుప రాడ్ ను కిందికి వదిలాడు. ఆ రాడ్ ను పట్టుకోవాలని బాలికకు చెప్పడంతో..ఆమె రాడ్ ను గట్టిగా పట్టుకుంది. సెక్యూరిటీ పై నుంచి రాడ్ సాయంతో ఆ బాలికను అతి కష్టం మీద ఎలాగోలా పైకి లాగి ప్రాణాలు కాపాడాడు. పాండాల బారి నుంచి చిన్నారి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సెక్యూరిటీ గార్డు ధైర్యానికి అందరూ సెల్యూట్ కొట్టారు.4484
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles