వీడియో: నడిరోడ్డుపై వాహనాలను ఓ ఆటాడుకున్న గజరాజం!



Mon,December 11, 2017 01:33 PM
వీడియో: నడిరోడ్డుపై వాహనాలను ఓ ఆటాడుకున్న గజరాజం!

ఏనుగు.. అది ప్రశాంతంగా ఉంటే ఏ సమస్యా లేదు. కాని దానికి కోపమొచ్చినా.. సంతోషం వచ్చినా అది ఏం చేస్తుందో దానికే తెలియదు. ఆ సమయంలో ఏం జరిగినా సర్వనాశనమే. ఇప్పుడు దాని ఉద్బోద ఎందుకంటే... ఓ ఏనుగు రోడ్డు మీదికి వచ్చింది. వచ్చింది నిమ్మలంగ ఉందా అంటె లేదు... నడి రోడ్డు పై వీరంగం సృష్టించింది. అటుగా వెళ్తున్న ఓ బస్సుకు అడ్డంగా వెళ్లింది. దీంతో బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఇక.. చూసుకోండి. ఆ బస్సును ముందు అద్దంపై ఒక్కటిచ్చింది. దెబ్బకు బస్సు అద్దం పగిలిపోయింది. దాన్ని ఓ ఆటాడుకున్నాక.. మరి కాస్త ముందుకెళ్లి పార్కింగ్ చేసి ఉన్న ఓ ట్రక్‌పై విరుచుకుపడింది. దాన్ని అటూ ఇటూ ఊపి.. కొంత డ్యామేజి చేసి అక్కడి నుంచి తుర్రుమన్నది. ఇక.. ఈ ఘటనలను అటవీ అధికారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ గజరాజం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నది. ఇంతకీ.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్పనేలేదు కదా.. సౌత్ వెస్ట్ చైనాలోని యున్నన్ ప్రావిన్స్‌లో గత శనివారం జరిగింది.

1905
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS