హహహ.. పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌పై ఫన్నీ వీడియో

Sat,July 6, 2019 07:08 PM

funny video on pakistan cricket team

ఈ వరల్డ్ కప్‌లో ఎక్కువగా వార్తల్లో నిలిచింది అంటే పాకిస్తాన్ టీం అనే చెప్పుకోవాలి. లీగ్ మ్యాచ్‌లో ఇండియాపై ఓడిపోయినప్పుడు పాకిస్తాన్ క్రికెటర్లపై పాకిస్తానీయుల నుంచే ఎన్నో విమర్శలు వచ్చాయి. తర్వాత బంగ్లాదేశ్‌పై 500 పరుగులు చేస్తామంటూ పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ వ్యాఖ్యానించడం.. ఆ వ్యాఖ్యలు కూడా దుమారం లేపాయి. పాక్ సెమీస్ చేరాలంటే చివరి మ్యాచ్‌లో భారీ స్కోర్ చేయాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచినా కూడా పాకిస్తాన్ సెమీస్ చేరలేకపోయింది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌పై ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పాకిస్తాన్ పని ఎలాగూ అయిపోయింది కాబట్టి.. ఇక.. పాక్ ఆటగాళ్లు సిస్టమ్ ముందు కూర్చొని టాస్ ఎలా గెలవాలని, లండన్, కరాచీ మధ్య చీప్ విమానాలు ఏమున్నాయని, లార్డ్స్ మైదానం సమీపంలో బెస్ట్ పిజ్జా, బర్గర్స్ ఏమున్నాయని, 500 పరుగులను ఉర్దూలో ఏమంటారని.. ఇలా వాళ్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారంటూ ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.


4395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles