ఉబెర్ డ్రైవర్, ప్యాసెంజర్ మధ్య ఫన్నీ చాట్.. వైరలయింది

Sat,December 16, 2017 03:59 PM

Funny chat between uber driver and passenger goes viral

అది నిజమా అబద్ధమా.. అనేది పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఆ ఫన్నీ చాట్ వైరలవుతుంది. అంతే.. మీరు కూడా ఆ ఫన్నీ చాట్ చదువుకొని కాసేపు నవ్వుకోండి. అంతే. ఏమంటరు. ఇంతకీ ఏంటా చాట్ అనేగా మీ డౌట్. మీరు పైన చూస్తున్నారే ఫోటో.. అదే ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను దుమ్మురేపుతున్నది.

దాన్ని ఓ సారి చదివి అర్థం చేసుకోండి.. మనం తర్వాత మాట్లాడుకుందాం. చదివారా.. అర్థమయిందా లేదా.. ఓ ఉబెర్ డ్రైవర్.. ప్యాసెంజర్‌కు మెసేజ్ చేస్తాడు. ఏమని అంటే... "నేను నీకోసం ఉన్నాను అని.. అప్పుడు ఆ ప్యాసెంజర్.. కృతజ్ఞ‌తలు.. నేను ప్రస్తుతం చాలా కష్టసమయాల్లో ఉన్నాను.. ఈ సమయంలో నువ్వు నాకు తోడుగా ఉండటం నిజంగా నా అదృష్టం.. ఇలా అడుగుతున్నందుకు సారీ.. నా కాంటాక్ట్ లిస్ట్ అంతా డిలీట్ అయిపోయింది.. ఇంతకీ మీరు ఎవరు? అని ప్యాసెంజర్ అడగగా.. దానికి బదులుగా ఉబెర్ డ్రైవర్... నేను మీ ఉబెర్ డ్రైవర్‌ని.. మిమ్మల్ని పిక్ అప్ చేసుకోవడానికి వచ్చాను..అంటాడు. అప్పుడు ప్యాసెంజర్ ఓహ్ అంటాడు..." అంతే, అర్థమయిందా? అయితే. ఇది కేవలం కారు రైడ్ గురించి మాట్లాడుతున్నదే అని.. ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి చెప్పగా... అసలు ఇదంతా ఫేక్ అని.. ఇదంతా కావాలని సృష్టించిందేనని కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇంకొంతమంది ఆ ఫన్నీ చాట్‌పై రీసెర్చ్ చేసి.. ఆ మెసేజ్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది.. కాని బ్లూలో ఉండదని.. ఇది ఖచ్చితంగా ఫేక్ అని.. అది ఫేక్ అయినా.. నిజమైనా.. ఆ ఫన్నీ చాట్ చదివి తెగ ఎంజాయ్ చేశామని మరికొందరు కామెంట్ చేశారు.


8424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS