సెలవు తీసుకోకుండా పని చేసినందుకు 2.4 లక్షల ఫైన్!

Fri,March 16, 2018 06:54 PM

French baker is fined $3,600 for working on holiday

ఎక్కడైనా కష్టపడి పనిచేసిన వాళ్లకు గుర్తింపు ఉంటుంది. ఇంకా సెలవు కూడా తీసుకోకుండా పని చేసిన వాళ్లను అందలం ఎక్కిస్తాయి కంపెనీలు. కాని.. ఇక్కడ సీన్ రివర్సయింది. సెలవు తీసుకోకుండా పని చేసిన ఓ వ్యక్తికి ఏకంగా 3600 డాలర్ల ఫైన్ వేశారు. షాకయ్యారా? పదండి ఇంకాస్త ముందుకెళ్దాం.

అది ఫ్రాన్స్. అక్క‌డ‌ కంపెనీ అయినా.. సొంత బిజినెస్ అయినా.. లోకల్ లేబర్ లా ప్రకారం.. వారానికి ఆరు రోజులే పని చేయాలి. అలా కాదని సెలవు రోజునా పని చేస్తే.. ఇదిగో.. ఈ వ్యక్తి జరిగినట్టే అందరికీ జరుగుతుంది. కెడ్రిక్ వైవ్రే అనే వ్యక్తి ప్యారిస్‌కు 120 మైల్స్ దూరంలో ఉన్న లుసిగ్నీ సుర్ బార్సె అనే టూరిస్ట్ ప్లేస్‌లో బేకరీని నిర్వహిస్తున్నాడు. సమ్మర్ సీజన్ సమీపిస్తుండటంతో ఈ సీజన్‌లో అక్కడ టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుందట. దీంతో బేకరీ ఐటెమ్స్‌కు ఫుల్లు డిమాండ్. అందుకే.. పగలనకా.. రాత్రనకా.. సెలవు తీసుకోకుండా పని చేశాడు. దీంతో ఈ విషయం లేబర్ అధికారులకు తెలియడంతో.. సెలవు తీసుకోకుండా పని చేసినందుకు 3600 డాలర్ల ఫైన్ వేశారు.

"ఇటువంటి చట్టాలు మా బిజినెస్‌ను నాశనం చేస్తున్నాయి. ప్రాన్స్‌లోని చాలా టౌన్స్‌లో సమ్మర్ టూరిస్టులను నమ్ముకొని బిజినెస్‌లు నడుస్తుంటాయి. కాని.. వారానికి ఒకరోజు సెలవు అంటూ ఈ రూల్ మా బిజినెస్‌ను దెబ్బ తీస్తున్నది. కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు పని చేయనీయకపోతే ఎలా.." అంటూ లుసిగ్నీ సుర్ బార్సె మేయర్ మీడియా ముందు వాపోయాడు.

ఈ రూల్‌పై విసిగిపోయిన కొంత మంది వ్యాపారస్థులు అంతా కలిసి వారానికి ఏడు రోజులు పని చేసుకునేలా పర్మిషన్ ఇవ్వాలని అక్కడి ప్రభుత్వంపై పిటిషన్ ఫైల్ చేశారట. చూద్దాం. మరి భవిష్యత్తులో వాళ్లకు అనుకూలంగా లేబర్ లాలో సవరణలు చేస్తారో లేదో?

18360
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS