మనం పారేస్తున్న ఆహారం విలువెంతో తెలుసా?

Tue,November 27, 2018 05:47 PM

FRANCE TOPS FOOD MANAGEMENT INDEX

మనదేశంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకుంటాం కానీ ఆహారపదార్థాలను వృధాగా పారేయడంలో మాత్రం మనం ఏమీ తక్కువ తినలేదు. అసలు మనదేశమే అనేముంది? ప్రపంచవ్యాప్తంగా పారేస్తున్న ఆహారం విలువ లక్ష కోట్ల డాలర్లు. మన భారతీయ కరెన్సీలో అయితే అది 74 లక్షల కోట్ల పైమాటే. మొత్తంగా ఉత్పత్తి అయ్యే ఆహారంలో ఇది మూడోవంతు ఉంటుందట. ఆకలితో అలమటించే ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్న భూమిమీద ఇది అనైతిక చర్యే కాకుండా పర్యావరణానికి హానికరం కూడా. ఆహారం వ్యర్థం కావడాన్ని నిరోధించడం, సుస్థిర విధానంలో ఆహారం ఉత్పత్తి చేయడంలో, ఆరోగ్యం, పోషకాహార స్థాయిలో ఫ్రాన్స్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నదని తాజా అంతర్జాతీయ నివేదిక తెలియజేసింది. ఎకానమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్, బరిల్లా సెంటర్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫౌండేషన్ ఈ నివేదికను సంయుక్తంగా రూపొందించాయి. ఈ నివేదికలో ఆయాదేశాల స్థితిగతులను బట్టి 67 దేశాల జాబితా ఇచ్చారు. ఫ్రాన్స్ తర్వాతిస్థానంలో నెదర్లాండ్స్, కెనడా, ఫిన్లాండ్, జపాన్ నిలిచాయి. కానీ చైనా, అమెరికా, బ్రిటన్‌కు కనీసం మొదటి 20 స్థానాల్లో చోటు దక్కలేదు. ఫ్రాన్స్ పర్యావరణ అనుకూల చర్యలతో పాటుగా వృథా నివారణకు ప్రత్యేక చొరవలు చేపట్టింది. మాల్స్‌లో మిగులు ఆహారం పంపిణీకి నెట్‌వర్క్ ఏర్పాటు చేసింది. ఆ సంగతి అలా ఉంచితే ఏ దేశం ఎంత ఆహారం వ్యర్థం చేస్తున్నదో చూస్తే ఫ్రాన్స్‌లో ఏటా తలసరిగా 67.2 కిలోలు, అమెరికాలో 95.1 కిలోలు, బెల్జియంలో 87.1 కిలోలు, కెనడాలో 78.2 కిలోలు నేలపాలవుతున్నది. పేదదేశాల్లో ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న రువాండా ఒక్కటే ఆహారం వృథా నిర్వహణలో మంచి మార్కులు సాధించింది. ఈ జాబితాకు ఎంచుకున్న నాలుగు అంశాల్లో ఒక్కో దేశానికి ఒక్కో సమస్య ఉంది. అమెరికాలో అధికంగా తినడం, చక్కెరపానీయాలు తాగడం వల్ల ఊబకాయం రావడం అనేది తీవ్రమైన జాడ్యంగా తయారైంది. చైనాలోల వ్యవసాయం వల్ల అధిక గ్రీన్‌హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి కావడం సమస్య. బ్రిటన్‌లోనూ గ్రీన్‌హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి ఎక్కువే. నీటి నిర్వహణలోనూ వెనుకబడి ఉంది. భారత్ జింబాబ్వే, జాంబియా తర్వాత 33వ స్థానంలో ఉంది. భారత్‌లో వ్యర్థమయ్యే ఆహారం 40 సాతం దాకా ఉంటుంది. దీంతో మొత్తం బ్రిటిన్‌కు తిండిపెట్టొచ్చు. హోటళ్లు, విందులు వినోదాల్లో ఎక్కువగా ఆహారం వ్యర్థమవుతుంది. అందుకే 88 దేశాల ప్రపంచ ఆహార సూచికలో ఇండియా 63వ స్థానంలో ఉంది.

4076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles