అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఎమర్జెన్సీ విధించే అవకాశం!

Sun,December 2, 2018 02:36 PM

France considering to impose Emergency to curb protests against Fuel Taxes

పారిస్: ఇంధనంపై పన్నులు, పెరిగిపోతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ గళమెత్తింది. రెండు వారాలుగా కొనసాగుతున్న ఆందోళనలు శనివారం హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు చేతుల్లో రాడ్లు, గొడ్డళ్లు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. కనిపించిన వాహనాలు, ఇళ్లను తగులబెట్టారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో ఈ ఆందోళనలను కట్టడి చేయడానికి ఎమర్జెన్సీ విధించే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం పరిశీలిస్తున్నది. యెల్లో వెస్ట్ పేరుతో ఈ ఉద్యమం నవంబర్ 17 నుంచి సాగుతున్నది. ఈ ఆందోళనలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్.. ప్రధాని, మంత్రులతో ఆదివారం ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించనున్నారు.నవంబర్ 17న చిన్నగా మొదలైన ఈ ఆందోళనలు సోషల్ మీడియా కారణంగా వేగంగా వ్యాపించాయి. రోడ్లపై బైఠాయించడం, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు, పెట్రో బంకులను తెరవకుండా అడ్డుకోవడం చేశారు. శనివారం ఇది తీవ్రస్థాయికి చేరింది. ఇళ్లు, వాహనాలను తగులబెట్టే స్థితికి చేరడంతో ఎమర్జెన్సీ విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. గత పదేళ్లలో ఫ్రాన్స్ ఎప్పుడూ ఈ స్థాయి ఆందోళనలను చూడలేదు. అయితే ఆందోళనకారులు హింసాత్మక చర్యలను నిలిపేసి చర్చలకు సిద్ధం కావాలని ప్రభుత్వం పిలుపునిస్తున్నది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ హింస జరిగిందని యెల్లో వెస్ట్ కార్యకర్త పాల్ మారా ఆరోపించారు.2724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles