న్యూజిలాండ్‌లో కాల్పులు.. నలుగురు అరెస్ట్

Fri,March 15, 2019 11:27 AM

Four people in custody one woman and three men says New Zealand CP Mike Bush

న్యూజిలాండ్ : న్యూజిలాండ్‌లోని క్రిస్ట్ చర్చిలో రెండు ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడిన విషయం విదితమే. కాల్పులు జరిగిన ప్రాంతంలో మహిళ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నామని న్యూజిలాండ్ పోలీసు కమిషనర్ మైక్ బుష్ తెలిపారు. కాల్పులు జరిగిన తర్వాత అక్కడున్న వాహనాల్లో భారీ సంఖ్యలో పేలుడు పదార్థాలను గుర్తించామని, అనంతరం వాటిని నిర్వీర్యం చేశామని చెప్పారు. అల్‌నూర్ మసీదు వద్ద జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఆయన స్పష్టం చేశారు. తెలుపు రంగులో ఉన్న ఓ వ్యక్తి మసీదులోకి ప్రవేశించి ఆటోమేటిక్ ఆయుధంతో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన సమయంలో మసీదు లోపల 300 మంది ఉన్నారని తెలిపారు. ఈ కాల్పుల నేపథ్యంలో న్యూజిలాండ్‌లోని అన్ని మసీదుల వద్ద భద్రత పెంచామని సీపీ స్పష్టం చేశారు.440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles