ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ కోఫి అన్నన్ కన్నుమూత

Sat,August 18, 2018 03:22 PM

Former UN Secretary General Kofi Annan has passed away

స్విట్జర్లాండ్ : ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫి అన్నన్(80) శనివారం ఉదయం కన్నుమూశారు. అస్వస్థతకు గురైన కోఫి అన్నన్ చికిత్స పొందుతూ స్విట్జర్లాండ్‌లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోఫి అన్నన్ మృతిపట్ల ప్రపంచ దేశాలు సంతాపం ప్రకటించారు. ఐరాస ప్రధాన కార్యదర్శిగా 1997 నుంచి 2006 వరకు పని చేశారు. 2001లో అన్నన్ కు నోబెల్ శాంతి బహుమతి వరించింది.

1962లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమతిలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. 1987-92 మధ్యకాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1997లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ నుంచి బాధ్యతలు చేపట్టారు. 5 సంవత్సరాల పదవీ కాలం అనంతరం రెండో పర్యాయం మళ్ళీ ఎన్నికై 2002 నుంచి మరో ఐదేళ్ళు పనిచేసి, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ కు అధికారం అప్పగించారు కోఫి అన్నన్.1709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles