పాక్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్

Mon,June 10, 2019 06:57 PM

Former Pakistan president Asif Ali Zardari arrested in fake bank accounts case

ఇస్లామాబాద్: నకిలీ బ్యాంకు ఖాతాల కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని అక్కడి అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. నకిలీ బ్యాంకు ఖాతాల నుంచి రూ.30 మిలియన్లను జర్దారీ స్వీకరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బ్యాంకు ఖాతాల కేసుతో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఇస్లామాబాద్‌లోని ఆయన నివాసంలో ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టులో ఆయన ద‌ర‌ఖాస్తు చేయ‌గా కోర్టు దాన్ని తిరస్కరించడంతో అరెస్ట్ చేశారు. ఈ కేసులో జర్దారీ సోదరి ఫర్యాల్ తల్పూర్ సహ నిందితురాలిగా ఉన్నారు. ఆయన అరెస్ట్‌కు ఆదివారమే వారెంట్ జారీ చేయగా.. తల్పూర్‌పై ఎలాంటి వారెంట్ ఇవ్వలేదు. దేశ అత్యున్నత అవినీతి నిరోధక సంస్థ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు మాజీ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. వీరిద్ద‌రికి చెందిన కంపెనీలు ఫేక్‌ బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ.4.4 బిలియ‌న్ల‌ అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎలాంటి ఆందోళనలు చేయవద్దని ఆసిఫ్ తనయుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ బుట్టో జర్దారీ పిలుపునిచ్చారు.

2390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles