6 గంటల్లోనే బ్రిడ్జ్ కట్టారు.. కానీ వారంలోనే కూలింది..

Fri,March 16, 2018 09:51 AM

foot over bridge in Miami collapsed, 4 dead

మియామి: అమెరికాలోని మియామిలో ఘోరం జరిగింది. పాదాచారుల బ్రిడ్జ్ కూలడంతో సుమారు నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మంది గాయపడ్డారు. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ దగ్గర ఈ ఘటన జరిగింది. రెస్క్యూ బృందాలు బ్రిడ్జ్ శిథిలాలను తొలిగిస్తున్నారు. ఎనిమిది లేన్ల రహదారిపై ఉన్న ఫూట్‌ఓవర్ బ్రిడ్జ్ అకస్మాత్తుగా కూలింది. ఈ ప్రమాదం వల్ల సుమారు ఎనిమిది వాహనాలు బ్రిడ్జ్ శిథిలాల కింద ధ్వంసం అయ్యాయి. మృతులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి వారం రోజుల క్రితమే ఈ ఫూట్‌జోవర్ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఈ బ్రిడ్జ్ సుమారు 950 టన్నుల బరువు ఉంటుంది. 53 మీటర్ల పొడుగు ఉంది. గత శనివారమే కేవలం ఆరు గంటల్లోనే ఈ బ్రిడ్జ్‌ను కట్టడం విశేషం. గత ఏడాది ఇదే స్థానంలో ఉన్న పాత బ్రిడ్జ్‌ను తొలిగించిన తర్వాత ఆ స్థానంలో కొత్త బ్రిడ్జ్‌ను నిర్మించారు. దీని కోసం 14 మిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు.

4789
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles