ఈ మెషిన్ మీ దుస్తుల‌ను మ‌డ‌త‌బెడుతుంది..!

Wed,January 9, 2019 02:56 PM

foldimate machine folds your clothes

అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జ‌రుగుతున్న క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షో (సీఈఎస్‌) 2019లో ఫోల్డిమేట్ అనే కంపెనీ ఫోల్డిమేట్ అనే ఓ వెరైటీ మిష‌న్‌ను ప్రద‌ర్శించింది. దీన్ని లాండ్రీ ఫోల్డ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంటే.. ఈ మెషిన్ మీ దుస్తుల‌ను మ‌డ‌త‌బెడుతుంద‌న్న‌మాట‌. ఒక ష‌ర్ట్ మ‌డ‌త‌బెట్టేందుకు ఈ మెషిన్ కేవ‌లం 5 సెక‌న్ల స‌మ‌యాన్ని మాత్ర‌మే తీసుకుంటుంది. ఇక మెషిన్‌లో ఒక‌సారి దుస్తుల‌ను ఫుల్‌గా లోడ్ చేస్తే వాట‌న్నింటిని ఈ ఫోల్డిమేట్ కేవ‌లం 5 నిమిషాల్లోనే మ‌డ‌త‌బెడుతుంది. కాగా ప్ర‌స్తుతం ఈ మెషిన్ ప్రోటోటైప్ ద‌శ‌లోనే ఉంది. అతి త్వ‌ర‌లో దీనికి మ‌రిన్ని హంగులు అద్ది మార్కెట్‌లోకి విడుదల చేయ‌నున్నారు. ఇక ఈ ఫోల్డిమేట్ మెషిన్ ధ‌ర దాదాపుగా రూ.69వేల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా..!

1102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles