పార్లమెంట్ భవనం పైకి డ్రోన్..పర్యాటకుడు అరెస్ట్

Mon,February 11, 2019 04:21 PM

Flying drone over Myanmar parliament French tourist arrested

యంగూన్ : పార్లమెంట్ భవనంపైకి ఫ్రెంచ్ పర్యాటకుడు ఆర్థర్ డెస్ క్లాక్స్ (27) డ్రోన్ పంపించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించిన పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 7న ఆర్థర్ డెస్ క్లాక్స్ ను అరెస్ట్ చేశాం. ప్రస్తుతం అతడు మా నిర్బంధంలో ఉన్నాడు. ఆర్ధర్ ను అరెస్ట్ చేసిన విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలియజేశాం. డ్రోన్ పంపించిన ఘటనలో నేరం రుజువైతే ఆర్ధర్ కు గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆర్ధర్ డెస్ క్లాక్స్ పార్లమెంట్ పై డ్రోన్ ఎందుకు ఎగరవేయాలనుకున్నాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మయన్మార్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భవనాలపై డ్రోన్లు ఎగరవేయడం చట్టవిరుద్ధం. 2017లో టర్కీకి చెందిన ఓ ఫ్రింట్ మీడియాకు చెందిన జర్నలిస్టులు డాక్యుమెంటరీ తీయడం కోసం మయన్మార్ పార్లమెంట్ పైకి డ్రోన్ పంపారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురు జర్నలిస్టులతోపాటు వారి డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేశారు. రెండు నెలల జైలు శిక్ష అనంతరం వారు విడుదలయ్యారు.

2082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles