కారును ఢీకొట్టిన బీర్ కెగ్.. త‌ప్పిన పెను ప్ర‌మాదం.. వీడియోWed,May 16, 2018 04:38 PM

Flying Beer Keg slams into windscreen moment caught on camera

బీర్ కెగ్ ఏంది అని టెన్షన్ పడకండి. మనం నీళ్లు తాగడం కోసం వాటర్ టిన్ పెట్టుకొని.. కింద నల్లాతో ఎలా పట్టుకొని తాగుతామో.. బీర్ కెగ్ కూడా అంతే. అందులో నుంచి చిల్డ్ బీర్‌ను గ్లాస్‌లో పోసుకొని ఏంచక్కా లాంగిచేయొచ్చు. అదంతా ఓకే కాని.. ఆ బీర్ కెగ్ కారును ఎలా ఢీకొట్టిందబ్బా అని ఇంకో డౌట్ కూడా వచ్చి ఉంటుంది మీకు. ఆ డౌట్ దెబ్బతిన్న ఆ కారు ఓనర్‌కు కూడా వచ్చింది కాని.. అది ఎలా రోడ్డు మీద ఎగురుకుంటూ వచ్చిందో మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. అసలేంజరిగిందంటే..

రోడ్డు మీద కారు వెళ్తున్నది. సడెన్‌గా జెట్ స్పీడ్‌తో వచ్చిన బీర్ కెగ్ ఆ కారు ముందు భాగాన్ని ఢీకొన్నది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. అయితే.. దేవుడి దయ వల్ల ఎవరికీ ఏం కాలేదు. కారును నడుపుతున్న వ్యక్తికి చిన్న గాయాలయ్యాయి అంతే. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్నది. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో యాక్సిడెంట్‌కు గురైన కారులోనే రికార్డయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

1974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS