పచ్చి నత్తగుల్లను తిన్నాడు.. మృత్యువాత పడ్డాడు!

Sat,July 21, 2018 07:26 PM

Florida man dies after eating raw oysters carrying flesh eating bacteria

ఫ్లొరిడాకు చెందిన ఓ వ్యక్తి రెండు పచ్చి నత్తగుల్లలను తిని మృత్యువాత పడ్డాడు. నత్తగుల్లకు అంటుకొని ఉండే మాంసాన్ని తినే బ్యాక్టీరియా వల్ల అతడు మృతి చెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. ఆ బ్యాక్టీరియాను విబ్రియో వల్నిఫికస్ బ్యాక్టీరియా అని పిలుస్తారు. ఇది శరీరంలోపల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను కలుగజేస్తుంది. దీంతో మనిషి మృత్యువాత పడుతాడని వైద్యులు తెలిపారు.

సాధారణంగా ఉప్పు నీటిలో ఈ బ్యాక్టీరియా సంచరిస్తుంటుంది. ముఖ్యంగా వేసవిలో ఇవి ఎక్కువగా ఉప్పు నీటిలో సంచరిస్తాయి. ఈ ఘటనపై ఫ్లొరిడా హెల్త్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. శరీరంపై ఏవైనా గాయాలు ఉన్నవాళ్లు నీటిలోకి వెళ్లినప్పుడు ఆ గాయాల ద్వారా ఆ బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుందని.. లేదంటే పచ్చి నత్తగుల్లలు, షెల్‌ఫిష్ లాంటివి తిన్నా అవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయని డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారిలో 16 కేసులు ఫ్లొరిడాలోనే జరిగాయని ఫ్లొరిడా హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

6363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles