ఫ్లాష్‌మాబ్‌.. బాలీవుడ్ పాట‌కు ఊగిపోయిన‌ అమెరికా మాల్‌

Fri,February 8, 2019 03:08 PM

flash mob dance for Bollywood song in California mall

కాలిఫోర్నియా: బాలీవుడ్ పాట‌కు.. ఓ షాపింగ్ మాల్ ఊగిపోయింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఓ రిటేల్ ఔట్‌లెట్‌లో ఫ్లాష్‌మాబ్ సంద‌డి చేసింది. బాలీవుడ్ సినిమాలోని లండ‌న్ తుముకుడా అనే సూప‌ర్‌హిట్ పాట‌కు షాపింగ్ మాల్‌లో ఉన్న డ్యాన్స‌ర్లు చిందేశారు. ఎరౌండ్ ద వ‌ర‌ల్డ్ ఇన్ 80 డ్యాన్సెస్ అన్న క్ల‌బ్ ఈ ఈవెంట్‌ను నిర్వ‌హించింది. డ్యాన్స్ ద్వారా సంస్కృతుల‌ను క‌ల‌పాల‌న్న ల‌క్ష్యంతో ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. డ్యాన్స్ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఇప్పుడీ వీడియోకు ల‌క్ష‌ల్లో లైక్‌లు వ‌స్తున్నాయి. షాపింగ్‌కు వ‌చ్చిన వాళ్లు కూడా డ్యాన్స్‌ను చూసి థ్రిల్ల‌య్యారు.

5572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles