రామచిలుక మిమిక్రీ చేష్టలు.. వీడియో

Mon,November 19, 2018 01:00 PM

Firefighters Respond To Emergency Call, Find Parrot Imitating Fire Alarm

రామచిలుక తెలుసు కదా. అవి భలేగా అరుస్తుంటాయి. కొన్ని చిలుకలైతే మాట్లాడుతాయి అంటారు. కానీ.. ఈ చిలుక డిఫరెంట్ బాస్. ఇది మిమిక్రీ చేస్తుంది. అలా మిమిక్రీ చేసే తన ఇంటి యజమానిని అడ్డంగా బుక్ చేసింది. ఈ ఘటన యూకేలోని డావెంట్రీలో చోటు చేసుకున్నది. ఓ ఇంట్లో స్మోక్ అలారం మోగుతున్నదని.. స్థానికులు ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ.. అక్కడ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. ఇంటిఓనర్‌ను ఆరా తీయగా.. ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరుగలేదని చెప్పాడు. స్మోక్ అలారం మోగలేదన్నాడు. అంతలోనే మరోసారి అలారం మోగడాన్ని గమనించారు ఫైర్ ఫైటర్స్. అప్పుడు తెలిసింది ఫైర్ అలారంను మోగించింది ఓ చిలుక అని. ఆఫ్రికాకు చెందిన గ్రే ప్యారెట్ అది. అది అచ్చం అలారం సౌండ్‌తో మిమిక్రీ చేస్తుందట. దాని మిమిక్రీని చూసే స్మోక్ అలారం అనుకొని పొరబడి ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారట స్థానికులు. ఆ చిలుక మిమిక్రీ చేస్తుండగా వీడియో తీసిన ఫైర్ ఫైటర్స్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

1968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles