బాంబులు పార్సిల్.. నిందితుడిని పట్టించిన వేలిముద్రలు

Sat,October 27, 2018 09:12 AM

Fingerprints on envelope led FBI to arrest Florida man who mailed bombs to Trump critics

ఫ్లోరిడా: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో పాటు మరో డజన్ మందికి పార్సిల్ బాంబులు పంపిన వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు పట్టుకున్నారు. ఆ నిందితుడిని సీజర్ సయోక్‌గా గుర్తించారు. అతని వయసు 56 ఏళ్లు. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అతను వీరాభిమాని. రిపబ్లికన్ పార్టీలో అతనికి రిజిస్ట్రేషన్ ఉంది. అమెరికాలోని హైప్రొఫైల్ కలిగిన 13 మందికి అతను బాంబులను పార్సిల్ చేశాడు. అయితే ఓ లేఖపై ఉన్న వేలిముద్రల ఆధారంగా ఫ్లోరిడా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ట్రంప్‌ను విమర్శిస్తున్న వారికి అతను బాంబులను పార్సిల్ చేసి అమెరికాలో తీవ్ర కలకలం రేపాడు. ఫోర్ట్ లాడరెల్‌లోని ఆటోస్పేర్ పార్ట్స్ షాపు ముందు నిందితుడు సీజర్ అల్టేరి సయోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓ బాంబు ప్యాకేజీపై ఉన్న వేలి ముద్రల ఆధారంగా నిందితున్ని పట్టుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు డీఎన్‌ఏను కూడా పరీక్షించినట్లు పోలీసులు చెబుతున్నారు. శుక్రవారం కూడా అతను మరో నలుగురికి బాంబులను మెయిల్ చేశాడు. సోషల్ మీడియాలోనూ సయోక్ డెమోక్రాట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన సేనేటర్ కమలా హారిస్‌కు కూడా అతను బాంబును పార్సిల్ చేశాడు. కానీ పోలీసులు ముందే ఆ పార్సిల్‌ను పట్టుకునానరు. అయితే ఎందుకు నిందితుడు బాంబులను పార్సిల్ చేశాడన్న విషయాన్ని పోలీసులు స్పష్టంగా చెప్పలేదు. నిందితుడు పార్సిల్ బాంబులతో ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశాడని, దానిమీద ఎరుపు రంగుతో ఎక్స్ అని రాశాడన్నారు. మియామీలోని ఓపా లాకా పోస్టాఫీసు నుంచి నిందితుడు బాంబులను పార్సిల్ చేశాడు. గతంలో సీజర్ సయోక్‌పై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. బాంబులను పార్సిల్ చేసిన అడ్రస్‌లో భాషా తప్పులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

1406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles