జైలులో ఘ‌ర్ష‌ణ‌.. 15 మంది మృతి

Mon,May 27, 2019 03:43 PM

Fighting between inmates at Brazil prison kills 15

హైద‌రాబాద్‌: బ్రెజిల్‌లోని ఓ జైలులో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ వ‌ల్ల 15 మంది మృతిచెందారు. మనాస్ ప‌ట్టణంలో ఉన్న అనిసో జాబిన్ కాంప్లెక్స్ జైలులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. విజిటింగ్ హ‌వ‌ర్స్ స‌మ‌యంలో ఖైదీల మ‌ధ్య‌ ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన‌ట్లు తెలుస్తోంది. విజిట‌ర్స్ ముందే క‌త్తుల‌తో ఖైదీలు కొంద‌ర్ని చంపేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జైలులో చెల‌రేగిన హింస‌ను అదుపు చేసిన‌ట్లు పోలీసులు చెప్పారు. రెండేళ్ల క్రితం బ్రెజిల్‌లోని ఓ జైలులో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లోనూ 56 మంది మృతిచెందారు. ప్ర‌స్తుత లెక్క‌ల ప్ర‌కారం బ్రెజిల్‌లో ఖైదీల సంఖ్య 7 ల‌క్ష‌లుపైనే ఉంది.

3160
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles