ట్యునీషియా-లిబియా సరిహద్దులో కాల్పులు 45 మంది మృతి

Tue,March 8, 2016 01:03 AM

Fierce clashes along Tunisia-Libya border kill 45 including civilians

తునిస్ : ట్యునీషియా-లిబియా దేశాల సరిహద్దు వద్ద ట్యునీషియా పోలీసులకు గుర్తుతెలియని సాయుధులకు మధ్య సోమవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సుమారు 45 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. లిబియాలో హింసాయుత తీవ్రవాదం విస్తరిస్తుండటంతో ఆ ప్రాంతంలో అస్థిరత నెలకొన్నది.

మృతుల్లో 28 మంది తిరుగుబాటుదారులు, పది మంది ట్యునీషియా సైనికులు, 12 ఏండ్ల బాలికతోసహా ఏడుగురు పౌరులు ఉన్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. సరిహద్దు నగరమైన బెన్‌గార్డేన్‌లోని పోలీస్‌స్టేషన్, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొన్న సాయుధ దుండగులు సోమవారం తెల్లవారుజామున కాల్పులు ప్రారంభించినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి యాసర్ మోష్బా తెలిపారు.

ఈ దాడులను సైనికులు వెంటనే తిప్పికొట్టారని ఎదురుకాల్పుల్లో 45 మంది చనిపోయారని అన్నారు. కొంతకాలంగా లిబియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం పెరుగుతుండటం ట్యునీషియాలో కొత్తగా ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. తరచూ కాల్పులు జరుగుతుండటం ఆ దేశానికి సంకటంగా పరిణమించింది.

1688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles