పార్సిల్ బాంబులు.. ఫ్లోరిడా పోస్ట్ ఆఫీసు నుంచే..

Fri,October 26, 2018 01:11 PM

FBI investigators check Florida post office in bomb mails case

ఫ్లోరిడా: అమెరికాలో పార్సిల్ బాంబులు కలవరం రేపుతున్నాయి. తాజాగా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్, హాలీవుడ్ హీరో రాబర్ట్ డీనిరోలకు కూడా పార్సిల్‌లో బాంబులు వచ్చినట్లు ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. అయితే కేసును పరిశీలిస్తున్న ఎఫ్‌బీఐ అధికారులు.. కొన్ని బాంబులు ఫ్లోరిడా నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. మియామిలోని ఓ పోస్ట్ ఆఫీసు నుంచి ఆ పార్సిళ్లు వచ్చినట్లు గుర్తించారు. అయితే ఆ పేలుడు పదార్ధాలను ఎవరు పంపారన్న కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు మొత్తం 89 మంది హై ప్రొఫైల్ వ్యక్తులకు బాంబులను పార్సిల్ చేశారు. ఆ లిస్టులో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్‌లు ఉన్నారు. మియామి పోస్టాఫీసులో ప్రస్తుతం సెక్యూర్టీ ఫూటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

న్యూయార్క్‌లోని టైమ్స్ వార్నర్ సెంటర్‌కు గురువారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అనుమానాస్పద ప్యాకేజీ ఉన్నట్లు తెలియడంతో ఆ భవనాన్ని ఖాళీ చేయించారు. కానీ అది ఫేక్ కాల్ అని తర్వాత నిర్ధారించారు. ఇదే బిల్డింగ్‌లో సీఎన్‌ఎన్ వార్తా సంస్థ ఉన్నది. సీఎన్‌ఎన్ సంస్థకు పోస్టులో వచ్చిన వైట్‌పౌడర్ వల్ల ఎటువంటి హాని లేదని పోలీసులు తెలిపారు. మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌కు రెండు పార్సిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. డెమోక్రటిక్ పార్టీ డోనర్ జార్జ్ సోరస్‌కు అనుమానాస్పద పార్సిల్ రావడంతో ఈ ఘటన బయటపడింది.

బాంబు పార్సిళ్ల ఉదంతం రాజకీయ మలుపు తీసుకున్నది. ఇప్పటి వరకు అనుమానాస్పద ప్యాకేజీలను అందుకున్నవారంతా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను విమర్శించిన వారు కావడం విశేషం. మరో రెండు వారాల్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం రాజకీయ కోణాన్ని ప్రశ్నిస్తున్నది. ఇటీవల ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ కూడా ఈ చర్యలను ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులగా చూడరాదు అని ఆయన అన్నారు.

1069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles