ఆఫ్ట్రాల్‌ ఓ పాము కోసం.. పెరడునంతా తవ్వేశారు.. వీడియో

Wed,March 14, 2018 05:01 PM

Family destroyed backyard to catch Deadly Snake

పామంటే ఆఫ్ట్రాల్‌ కాదంటారా? నిజమే.. అది ఆఫ్ట్రాల్‌.. ఓ పాము మాత్రమే అయితే.. వాళ్లు అంత రిస్క్ తీసుకునే వాళ్లు కాదేమో. కాని.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో రెండో జాతికి చెందిన పాము అది. అందుకే దాని కోసం ఇంటి వెనక ఉన్న పెరడునే తవ్వించారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న హెలెన్స్‌వాలేలో చోటు చేసుకున్నది.

ఆ ఇంట్లోని పెరడులో ఉన్న కాంక్రీటు స్లాబ్‌లో డేంజరస్ పాము గత ఆరు నెలల నుంచి దాక్కొని ఉందట. దాన్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది మాత్రం చిక్కలేదట. దీంతో పాములను పట్టేవాళ్లను రంగంలోకి దించిన ఆ ఇంటి యజమాని... ఆ కాంక్రీటు స్లాబును పగులగొట్టించాడు. అనంతరం ఆ పామును రెస్క్యూ టీం పట్టుకొని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. 1.3 మీటర్ల పొడవు ఉన్న ఆ పాము పేరు బ్రౌన్ స్నేక్ అని అది చాలా ప్రమాదకరమైందని దాన్ని పట్టుకున్న రెస్క్యూ టీం వివరించింది.

5022
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles