నీరవ్ మోదీ వల్ల నా గర్ల్‌ఫ్రెండ్ నాకు దూరమైంది!

Mon,October 8, 2018 03:41 PM

Fake Diamond Ring sold by Nirav Modi to a Canadian man cost him his Girlfriend

న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బ్యాంకులనే కాదు వ్యక్తులను కూడా నిండా ముంచాడు. తాజాగా బయటకు వచ్చిన ఓ సమాచారం ప్రకారం కెనడాకు చెందిన ఓ వ్యక్తి అతని చేతిలో దారుణంగా మోసపోయాడు. నీరవ్ చేసిన పనికి ఆ వ్యక్తి ఇప్పుడు గర్ల్‌ఫ్రెండ్‌కు దూరమై, పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం ఆ కెనడా జాతీయుడైన అల్ఫోన్సోకు నీరవ్ మోదీ ఓ నకిలీ డైమండ్‌ను అంటగట్టాడు. దాని విలువ సుమారు రూ.1.4 కోట్లు. దీనివల్ల అతను ఆర్థికంగా నష్టపోయాడు. అంతకుమించి తాను ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి దూరమైంది. ఎంగేజ్‌మెంట్ కోసం అతను ఆ డైమండ్ రింగ్ తీసుకున్నాడు. అది నకిలీదని తేలడంతో ఆమె అతన్ని వదిలేసింది. దీంతో అతడు పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.

నకిలీ రింగులు కొని తన కూతురికి ప్రపోజ్ చేశావా అంటూ ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా తనను నిలదీశారని అల్ఫోన్సో చెప్పాడు. 2012లో అతనికి నీరవ్ మోదీతో పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో నీరవ్‌పై తనకు ప్రత్యేక గౌరవం ఏర్పడిందని అల్ఫోన్సో చెప్పాడు. ప్రస్తుతం అతనిపై కేసులు ఉన్న విషయం కూడా తెలియకపోవడంతో అతను ఈ ఏడాది ఏప్రిల్‌లో తనకు ఓ డైమండ్ రింగ్ కావాలంటూ నీరవ్ మోదీకి మెయిల్ చేశాడు. దీంతో లక్షా 20 వేల డాలర్ల విలువైనదంటూ 3.2 కారెట్ డీ కలర్ డైమండ్‌ను అతను అల్ఫోన్సోకు పంపించాడు. ఆ తర్వాత మరో 80 వేల డాలర్లు పెట్టి 2.5 కారట్ ఓవల్ డైమండ్‌ను కూడా అతను కొన్నాడు.

ఈ రింగులతోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కు తను ప్రపోజ్ చేశాడు. వీటికి సంబంధించిన అధికారిక సర్టిఫికెట్లు, ఇన్‌వాయిస్‌లు ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా నీరవ్ మోదీ ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చి స్థానికంగా ఉండే ఓ వ్యక్తికి చూపించగా.. అవి నకిలీవని తేలింది. నీరవ్ మోదీ ఇలా చాలా మందికి నకిలీ డైమండ్లు ఇచ్చిన మోసం చేసినట్లు గతంలోనే వార్తలు రాగా.. ఓ వ్యక్తి నేరుగా బయటకు వచ్చి చెప్పుకోవడం మాత్రం ఇదే తొలిసారి.

4057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles