లంక పేలుళ్లు.. ఉగ్ర‌సంస్థ వ‌ద్ద 14 కోట్ల న‌గ‌దు

Tue,May 7, 2019 09:34 AM

extremist group behind Sri Lanka blasts has Rs 14 crores in cash

హైద‌రాబాద్: ఇటీవ‌ల శ్రీలంక‌లో జ‌రిగిన వ‌రుస పేలుళ్ల‌ల‌కు నేష‌న‌ల్ తౌహీద్ జ‌మాత్ సంస్థ ఉగ్ర‌వాదులే కార‌ణ‌మ‌ని పోలీసులు తేల్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఉగ్ర‌సంస్థ గురించి మ‌రికొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన నిజాల‌ను కూడా తాజాగా పోలీసులు వెల్ల‌డించారు. నేష‌న‌ల్ తౌహీద్ జ‌మాత్ గ్రూపు వ‌ద్ద సుమారు 14 కోట్ల న‌గ‌దును పోలీసులు గుర్తించారు. ఇంకా ఆ సంస్థ వ‌ద్ద సుమారు 700 కోట్ల విలువైన ఆస్తులు ఉన్న‌ట్లు అంచ‌నా వేశారు. న‌గ‌దులో స‌గం మొత్తాన్ని సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగితా స‌గం మొత్తం బ్యాంక్ అకౌంట్ల‌లో ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే ఆ అకౌంట్ల‌ను ర‌ద్దు చేయ‌నున్నారు. ఈస్ట‌ర్ వేళ జ‌రిగిన వ‌రుస పేలుళ్ల‌లో 250 మంది మృతిచెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ఘ‌ట‌న‌కు సంబంధించి 74 మంది అనుమానితుల‌ను అరెస్టు చేశారు.

1808
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles