సొంత యజమానినే చంపేసిన పక్షి

Mon,April 15, 2019 07:49 PM

మనం సాధారణంగా కుక్కలను, పిల్లులను, కోళ్లను, పక్షులను పెంచుకుంటుంటాం. కొన్నింటినీ డబ్బు కోసం పెంచినా.. మరి కొన్నింటిని పెట్స్‌గా కూడా పెంచుకుంటాం. మనం ఎంతో కష్టపడి.. మేత వేసి పెంచుకునే జంతువులు మనల్నే చంపడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటది. యూఎస్‌లోని ఫ్లొరిడాలో అదే జరిగింది. తన సొంత ఓనర్‌నే చంపేసింది ఓ పక్షి. దాని పేరు కాస్సోవరీ. అది చాలా పెద్దగా ఉంటుంది. అచ్చం ఈము పక్షిలా ఉంటుంది. కాకపోతే అది ప్రపంచంలోనే అత్యంత డేంజర్ పక్షి అట. ఆస్ట్రేలియా, పపువా న్యూ గెనియాలో ఈ జాతి పక్షులు ఎక్కువగా ఉంటాయట.


ఫ్లొరిడాలోని గేన్స్‌విల్లేకు చెందిన వ్యక్తి ఈ పక్షిని పెంచుతున్నాడట. అయితే.. దాని దగ్గరికి ఆయన వెళ్తున్న క్రమంలో కింద పడ్డారట. దీంతో వెంటనే ఆ పక్షి అతడిపై దాడి చేసి తన పంజాతో రక్కిందట. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలై మృతి చెందినట్లు వైల్డ్‌లైఫ్ అధికారులు వెల్లడించారు.ఈ పక్షులు దాదాపు 2 మీటర్ల(6 ఫీట్లు) వరకు పెరుగుతాయి. 60 కిలోల బరువు వరకు పెరుగుతాయి. నల్లటి ఈకలు, నీలి రంగు తల, మెడను కలిగి ఉంటుంది ఈ పక్షి.

సాన్ డియెగో జూ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ పక్షులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షులట. ఎందుకంటే.. వీటి గోర్లు 10 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయట. వాటి దగ్గరికి ఎవరు వెళ్లినా వాటి గోళ్లతో రక్కి చంపేస్తాయట. వీటిని తినడం కోసం కాకున్నా.. వాటి జాతిని రక్షించడం కోసం పెంచుతుంటారట.

9033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles