మిస్సైల్ ప‌రీక్ష విఫ‌లం.. అది మ‌రో చెర్నోబిలా ?

Sat,August 10, 2019 09:59 AM

Experimental isotope & liquid propellant engine blast kills 5 Russian nuclear experts

హైద‌రాబాద్‌: ర‌ష్యాకు చెందిన ఓ మిలిట‌రీ కేంద్రంలో జ‌రిగిన అనుమానిత మిస్సైల్ ప‌రీక్ష విఫ‌ల‌మైంది. మిస్సైల్ పేల‌డం వ‌ల్ల అయిదుగురు మృతిచెందారు. అణు సంస్థ రోసాట‌మ్‌లో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. లిక్విడ్ ప్రొపెల్లంట్ ఇంజిన్ కోసం ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో పేలుడు ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. అయితే ఆ స‌మ‌యంలో సైట్ వ‌ద్ద అణుధార్మిక‌త‌(న్యూక్లియ‌ర్‌ రేడియేష‌న్) విడుద‌లైన‌ట్లు మొద‌ట అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఆర్కెన్‌గ‌ల్స్ ప్రాంతంలో ఉన్న మిలిట‌రీ ఫైరింగ్ రేంజ్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో మ‌రో ముగ్గురు మిలిట‌రీ వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ర‌హ‌స్య ప్ర‌దేశంలో ర‌ష్యా ఇంత‌కీ ఎటువంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంద‌న్న దానిపై క్లారిటీ రావ‌డం లేదు. చెర్నోబిల్ లాంటి అణు ప్ర‌మాదం ఏదైనా జ‌రిగి ఉంటుందేమో అన్న అనుమానాలను వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ప్ర‌భుత్వాధికారులు దాన్ని దాచిపెడుతున్న‌ట్లు ఆరోపిస్తున్నారు.

2325
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles