HomeLATEST NEWSEVERY YEAR 40K DIE OF GUN VILOENCE IN US

అమెరికాలో ఏటా 40 వేల మంది తుపాకులకు బలి

Published: Fri,December 14, 2018 05:08 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

స్కూల్‌లోనో, మాల్‌లోనో కాల్పులు జరగని రోజంటూ అమెరికాలో ఉండదు. గతఏడాది (2017) ఏకైక అగ్రరాజ్యంలో సుమారు 40 వేలమంది తుపాకుల కారణంగా మృత్యువాత పడ్డట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంచనా వేస్తున్నది. 1999లో తుపాకుల వల్ల 28,874 మంది మరణిస్తే 2017లో 39,773 మంది మరణించారు. అంటే అప్పటికీ ఇప్పటికీ పదివేలు తేడా అన్నమాట. 2017లో తుపాకుల వల్ల మరణించినవారిలో 23,854 మంది కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నవారే. గత 18 సంవత్సరాల్లో ఇది గరిష్ఠస్థాయి. 1999లో ఈ సంఖ్య ఏడు వేలు. తుపాకుల వల్ల మరణించినవారి జాబితాలో హత్యల, ఆత్మహత్యలు, ప్రమాదవశాత్తు తూటాలు తగిలి ప్రాణాలు కోల్పోవడం, చట్టపరమైన చర్యల్లో కాల్పులకు గురై మరణించడం వంటివి చేర్చారు. తుపాకీ వల్ల మరణించినవారిలో అత్యధికులు తెల్లజాతివారే కావడం గమనార్హం. 39,773 మందిలో 23,827 మంది వారే. ఇక తుపాకీ ద్వారా హత్యకు గురైనవారిలో నల్లజాతివారే అధికం. 2017లో ప్రతిరోజూ అమెరికాలో సుమారు 109 మంది తుపాకీహింసకు బలయ్యారు. అమెరికాలో తుపాకుల అమ్మకం యథేచ్ఛగా సాగుతుంటుంది. ఎవరైనా సంతలో కూరగాయలు కొన్నట్టుగా తుపాకులు కొనొచ్చు. వాటిలో చిన్నసైజు పిసటల్ మొదలుకుని అటోమెటిక్ రైఫిల్స్ దాకా ఉంటాయి. అవి ఉపయోగించే బడిపిల్లలు మారణహోమాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా తుపాకులపై నియంత్రణ విధించాలని హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తుండగా చట్టాల అవసరం లేదని నైషనల్ రైఫిల్ అసోసియేషన్ యథావిధిగా పాత వాదననే వినిపించింది.

888
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology