మీరు మా నుంచి విడిపోవచ్చు.. బ్రిటన్‌కు గ్రీన్‌సిగ్నల్

Sun,November 25, 2018 04:14 PM

Europian Union agrees Brexit Deal in Brussels Meeting

బ్రస్సెల్స్: యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియకు మిగతా 27 దేశాల నేతలు అంగీకరించారు. బ్రస్సెల్స్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ డీల్‌కు నేతలు ఓకే చెప్పారు. కేవలం అరగంట పాటు జరిగిన సమావేశంలో 600 పేజీల ఒప్పందానికి ఆమోద ముద్ర వేశారు. వచ్చే ఏడాది మార్చి 29న ఈయూ నుంచి బ్రిటన్ వేరు పడనుంది. ఆ తర్వాత బ్రిటన్‌తో మిగతా యురోపియన్ యూనియన్ దేశాల స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన 26 పేజీల డిక్లరేషన్‌పై కూడా ఈయూ దేశాధినేతలు సంతకాలు చేశారు. బ్రిటన్ ప్రజలంతా ఈ విషయంలో ప్రధాని థెరెసా మేకు అండగా నిలవాలని ఈయూ నేతలు కోరారు. డీల్ కుదిరింది అని సమావేశం తర్వాత యురోపియన్ యూనియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జీన్ క్లాడ్ జంకర్ మీడియాకు వెల్లడించారు. ఇది నిజంగా బాధాకరమైన రోజు. బ్రెగ్జిట్ ఓ విషాదం అని జంకర్ అన్నారు. బ్రిటన్ ప్రభుత్వం అక్కడి పార్లమెంట్ ఆమోదం పొందుతున్న విశ్వాసం తమకుందని ఆయన అన్నారు. ప్రస్తుతం బ్రిటన్‌కు సంబంధించి ఇదే బెస్ట్ డీల్ అని, దీనికి అక్కడి పార్లమెంట్ ఓటేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బ్రెగ్జిట్ ఓటు యూరప్ సంస్కరణలను నొక్కి చెప్పిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ అన్నారు.

2453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles