ప్రపంచంలో అత్యంత అసహ్యకరమైన కుక్క చచ్చిపోయింది..

Wed,July 11, 2018 06:09 PM

English bulldog named world ugliest dog dies at age nine

ఆకుక్కకు ఉన్న బిరుదేంటో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన కుక్క అనే టైటిల్. కాని.. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇంగ్లీష్ బుల్‌డాగ్ జాతికి చెందిన జ్సా జ్సా అనే ఈ కుక్క చనిపోయింది. గత నెలలోనే దానికి ఈ టైటిల్ దక్కగా.. దానికి సంబంధించిన వేడుకలు పూర్తి కాకముందే అది మరణించడంతో ఇప్పుడు దాని యజమాని శోకసంద్రంలో మునిగిపోయాడు. మంగళవారం ఉదయం నిద్రలోనే అది కన్నుమూసింది. కాలిఫోర్నియాలోని పెటలుమాలో గత నెల జరిగిన కంటెస్ట్‌లో దానికి ఈ టైటిల్ దక్కింది. దానికి ఇప్పుడు తొమ్మిదేండ్లు. అయితే.. తన నాలికను నోటి లోపల పెట్టుకోలేని ఆ కుక్క ఎప్పుడూ చొంగ కారుస్తూ ఉంటుంది. ఈ జాతి కుక్కలు అరవడం తప్పిచ్చి కరవలేవు. ఎందుకంటే.. వాటి దవడ పైన పళ్లు నిలువుగా ఉంటాయి.

3127
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS