రెండేళ్ల చిన్నారి కోసం 4 ఏనుగులతో గాలింపు

Mon,December 24, 2018 05:18 PM

Elephants joined search operation for 2-year-old boy in thailand

ఇటీవలే అదృశ్యమైన రెండేళ్ల బాలుడి ఆచూకీ కోసం థాయ్‌లాండ్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. బాలుడి కోసం అధికారులు నాలుగు ఏనుగుల సాయంతో చెరుకు తోటల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. మయన్మార్ నుంచి వలస వచ్చిన కార్మికుడు డిసెంబర్ 17న తన భార్యతో కలిసి చెరుకు తోటలో పనిచేస్తుండగా.. వారి రెండేళ్ల కుమారుడు సులుయ్ పీ ఆడుకుంటూ బయటకు వచ్చి కనిపించకుండా పోయాడు. సమాచారమందుకున్న థాయ్‌లాండ్ రెస్క్యూ టీం బాలుడి ఆచూకీని కనుగోనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తమ కొడుకును ఎవరైనా ఎత్తుకెళ్లి ఉండొచ్చని బాలుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

‘చెరుకు తోట పరిసరాల ప్రాంతాల నుంచి చిన్నారి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాం. వారం నుంచి చిన్నారి కనిపించకుండా పోవడం బాధాకరమైన విషయం. అతన్ని సురక్షితంగా తీసుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని’ సెర్చ్ ఆపరేషన్‌కు నేతృత్వం వహిస్తున్న నిమిత్ వెల్లడించారు.

2351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles