భార‌త్‌లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌.. ప్ర‌పంచ దేశాల‌కు ప్రేర‌ణ‌

Fri,May 24, 2019 10:21 AM

Elections in India an inspiration around the world: United States

హైద‌రాబాద్‌: భార‌త్‌లో నిర్వ‌హించిన లోక్‌స‌భ ఎన్నిక‌ల తీరును అమెరికా మెచ్చుకున్న‌ది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ‌మైన‌ భార‌త్ త‌న ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌తో ప్ర‌పంచ దేశాల‌కు ప్రేర‌ణ‌గా నిలిచింద‌ని అగ్ర‌రాజ్యం అమెరికా వెల్ల‌డించింది. ఎన్నిక‌ల భారీ మెజారిటీతో రెండ‌వ‌సారి ప్ర‌ధాని బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న న‌రేంద్ర మోదీకి అమెరికా ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్ కంగ్రాట్స్ చెప్పారు. ప్ర‌జాస్వామ్యానికి భార‌త ప్ర‌జ‌లు అమితంగా క‌ట్టుబ‌డి ఉన్నార‌న్న దానికి నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న అన్నారు. భార‌త్‌తో మ‌రింత స్వేచ్ఛ‌గా, భ‌ద్రంగా ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు పెన్స్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో కూడా ట్విట్ట‌ర్ ద్వారా మోదీకి విషెస్ తెలిపారు. మోదీకి, ఎన్డీయేకు కంగ్రాట్స్‌, భారీ సంఖ్య‌లో ఓటేసిన భార‌త ప్ర‌జ‌ల‌కు కూడా ధ‌న్యవాదాలు తెలుపుతున్నాన‌ని పొంపియో అన్నారు. అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్ ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు.


4206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles