పారిస్‌లో ఆందోళ‌న‌లు.. ఈఫిల్ ట‌వ‌ర్ మూసివేత

Fri,December 7, 2018 12:08 PM

Eiffel Tower to close on Saturday amid Paris riot fears

పారిస్: ఫ్రాన్స్‌లో ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. దీంతో శ‌నివారం పారిస్‌లోని ఈఫిల్ ట‌వ‌ర్‌ను మూసివేయ‌నున్నారు. ఇంధనంపై పన్నులు, పెరిగిపోతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ గళమెత్తిన విష‌యం తెలిసిందే. రెండు వారాలుగా కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు చేతుల్లో రాడ్లు, గొడ్డళ్లు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. కనిపించిన వాహనాలు, ఇళ్లను తగులబెట్టారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దేశ‌వ్యాప్తంగా 89 వేల పోలీసు ఆఫీస‌ర్లు డ్యూటీలో ఉన్నారు. ఆర్మీ వాహ‌నాలను కూడా మోహ‌రించారు. పారిస్‌లో ఉన్న షాపులు, రెస్టారెంట్ల‌ను మూసివేయాల‌ని పోలీసులు ఆదేశించారు. యెల్లో వెస్ట్ పేరుతో ఫ్రాన్స్‌లో నవంబర్ 17 నుంచి ఉద్యమం సాగుతున్నది.

1745
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles