పైనుంచి పడిపోతున్న పిల్లాడిని కాపాడిన పోలీసు.. వీడియో

Fri,February 23, 2018 03:22 PM

Egyptian cop catches 5 year old who fell from the third floor

ఈజిప్టులోని ఓ నగరం.. బహుళ అంతస్తులు గల ఓ భవనంలోని మూడో అంతస్తులో నిశ్చితార్థ వేడుక జరుగుతోంది. ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. కొందరు ఫ్రెండ్స్‌తో ముచ్చటిస్తున్నారు. మరికొందరు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఓ బాలుడు మాత్రం ఆడుకుంటూ.. ఆ గది కిటికీ వద్దకు వచ్చాడు. అక్కడున్న కుర్చీ సహాయంతో కిటికీ పైకి ఎక్కాడు. బయట ఉన్న కిటికీ ఫ్లోర్‌పైకి వచ్చి బిత్తిరి చూపులు చూస్తున్నాడు. ఈ విషయాన్ని భవనం కింద ఉన్న ఓ పోలీసు గమనించాడు. మిగతా పోలీసులను అప్రమత్తం చేశాడు. అంతలోనే ఆ ఐదేళ్ల బాలుడు కిందపడి పోతుండగా.. కమీల్ ఫాతీ గీడ్ అనే పోలీసు.. అతడి ప్రాణాలు కాపాడాడు. ఆ తర్వాత బాలుడిని మూడో అంతస్తులోకి తీసుకెళ్లి.. తల్లిదండ్రులకు అప్పజెప్పగా.. తల్లి ఒకింత ఆశ్చర్యానికి గురైంది. తమ అబ్బాయి కింద పడటం ఇదేమీ కొత్త కాదని తల్లి చెప్పింది. గతంలో కూడా పలుమార్లు కిందపడిపోయాడని.. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని తల్లి పోలీసులకు తెలిపింది.

4060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles