వీడియో: సముద్రంలో చిక్కుకున్న స్విమ్మర్స్‌ను కాపాడిన డ్రోన్

Fri,January 19, 2018 01:46 PM

Drone rescued two swimmers who got caught in rough sea in new south wales

సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న నేటి జనరేషన్ కొత్త కొత్త టెక్నాలజీలను రూపొందిస్తూ అంచలంచెలుగా ఎదుగుతున్నది. ఇక.. సరికొత్త టెక్నాలజీలో ప్రస్తుతం డ్రోన్ పాత్ర ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. సెక్యూరిటీ కోసం, ఉగ్రవాదుల నీడను కనిపెట్టడానికి.. ఇలా చాలా రకాలుగా డ్రోన్ ఉపయోగపడుతున్నది. అయితే.. ఇప్పుడు డ్రోన్ మరో చరిత్ర సృష్టించింది. మొట్టమొదటి సారిగా సముద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు స్విమ్మర్స్‌ను కాపాడి రికార్డ్ క్రియేట్ చేసింది. న్యూ సౌత్ వేల్స్‌లో ఈ ఘటన జరిగింది. సముద్రంలో చిక్కుకున్న ఇద్దరు స్విమ్మర్స్‌కు పైనుంచి లైఫ్ జాకెట్ కిందకు విసిరేసి వాళ్లను కాపాడింది.

ఇద్దరు వ్యక్తులు సముద్రంలో చిక్కుకోవడాన్ని గమనించిన మిగితా టూరిస్టులు అక్కడ ఉన్న లైఫ్‌గార్డ్స్‌కు చెప్పారు. దీంతో వాళ్లు డ్రోన్ పైలట్‌ను అలర్ట్ చేశారు. వెంటనే డ్రోన్ పైలట్‌ను డ్రోన్‌ను వాళ్ల దగ్గరికి పంపించి వారికి డ్రోన్‌తో లైఫ్ జాకెట్లను అందించాడు. దీంతో రెస్క్యూ పాడ్‌ను పట్టుకొని వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక.. దానికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నది.


3302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles