ఇంధ‌న కేంద్రాల‌పై డ్రోన్ దాడి.. మంట‌ల్లో ఆర‌మ్‌కో

Sat,September 14, 2019 11:16 AM

Drone attacks on Saudi Aramco plants trigger fires

హైద‌రాబాద్‌: రియాద్‌లో ఉన్న ఆర‌మ్‌కో కంపెనీలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఇంధ‌న సంస్థ‌లో ఉన్న రెండు కేంద్రాల నుంచి భారీ స్థాయిలో మంట‌లు వ్యాపిస్తున్నాయి. అయితే డ్రోన్ల‌తో ఇంధ‌న కేంద్రాల‌ను టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. స్థానిక మంత్రి ఒక‌రు మీడియాతో ఈ విష‌యాన్ని కూడా వెల్ల‌డించారు. అబ్‌క‌యిక్‌, ఖుర్యాస్‌లో ఉన్న రెండు కేంద్రాల్లో చెల‌రేగిన మంట‌ల్ని ఆర్పేందుకు ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూర్టీ టీమ్ ప్ర‌య‌త్నిస్తున్న‌ది. ఇటీవ‌ల యెమెన్‌కు చెందిన హౌతీ రెబ‌ల్స్ .. డ్రోన్ దాడుల‌తో హ‌ల్‌చ‌ల్ చేశారు. గ‌తంలోనూ ఈ కంపెనీపై మిలిటెంట్లు దాడి చేశారు. అయితే ప్ర‌స్తుతం ఎవ‌రు దాడి చేశార‌న్న విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు.

1091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles