కారు నడుపుతూ నిద్రపోయాడు.. డివైడర్‌ను ఢీకొట్టాడు.. వీడియో

Sun,May 13, 2018 06:44 PM

Driver falls asleep while driving car and hit with divider in china

వాహనాలను నడిపే డ్రైవర్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుకు గురైనా అంతే. అందుకే.. డ్రైవింగ్ చేసే వాళ్లు తగినంత విశ్రాంతి తీసుకున్నాకే రోడ్డెక్కుతారు. అయితే.. రీసెంట్‌గా చైనాలో ఓ యాక్సిడెంట్ జరిగింది. అది కూడా చాలా గమ్మత్తుగా జరిగింది. ఎందుకంటే.. అవతలవైపు రోడ్డు నుంచి వెళ్తున్న ఓ కారు సడెన్ గా టర్న్ అయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి ఇవతల రోడ్డు వైపుకు దూసుకొచ్చింది. అదే సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టబోయింది. కాని.. ఆ బైకర్ చాకచక్యంగా కారు నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. చివరకు ఆ కారు వెళ్లి ఓ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

6433
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS