మాతో పెట్టుకోవ‌ద్దు: పాక్ మిలిట‌రీ వార్నింగ్‌

Fri,February 22, 2019 05:24 PM

Dont mess with us, Pakistan Military warns India

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌కు చెందిన మిలిట‌రీ ఆప‌రేష‌న్స్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆసిఫ్ గ‌ఫూర్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. త‌మ‌పై దాడి చేయ‌రాదు అని, పాక్‌తో పెట్టుకుంటే ప‌ర్య‌వ‌సానాలు తీవ్రంగా ఉంటాయ‌ని ఆయ‌న‌ హెచ్చరించారు. పాక్ యుద్ధానికి ప్రిపేర‌వుతుంద‌న్న వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు. పాక్ యుద్ధానికి స‌మాయ‌త్తం కావ‌డంలేద‌ని, బెదిరింపులు, యుద్ధం అనే వాద‌న‌లు ఇండియా నుంచే వ‌స్తున్నాయ‌ని, ఆత్మ‌ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కే తాము ప్రాధ్యానం ఇస్తున్నామ‌న్నారు. మీరు ఎటువంటి దాడికి పాల్ప‌డి మ‌మ్ముల్ని స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని భావిస్తే, ఆ త‌ర్వాత పాకిస్థాన్ ఇచ్చే స‌ర్‌ప్రైజ్ వేరుగా ఉంటుంద‌ని డీజీ ఆసిఫ్ గ‌ఫూర్ అన్నారు. సైన్యం, ప్ర‌జ‌లు, ప్ర‌ధాని, త్రివిధ‌ద‌ళాధిప‌తులు, రాజ‌కీయ పార్టీలు అంద‌రూ ఒకే మాట‌పై ఉన్నాయ‌న్నారు. బెదిరింపులను, క‌వ్వింపు చ‌ర్య‌ల‌ను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, పాక్‌తో పెట్టుకోవ‌ద్దు అని మేజ‌ర్ జ‌న‌ర‌ల్ గ‌ఫూర్ తెలిపారు. ఈనెల 14వ తేదీన పుల్వామా దాడి త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొన్నది. ఆ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.

6700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles