అమెరికా విదేశాంగ మంత్రిని తొల‌గించిన ట్రంప్‌

Tue,March 13, 2018 06:37 PM

Donald Trump removes Secretary of state Rex Tillerson

వాషింగ్ట‌న్ః అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రో షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. విదేశాంగ మంత్రి రెక్స్ టిల‌ర్‌స‌న్‌ను తొల‌గించారు. ఆయన స్థానంలో ఇన్నాళ్లూ సీఐఏ డైరెక్ట‌ర్‌గా ఉన్న మైక్ పాంపియోను నియ‌మిస్తున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇక సీఐఏ డైరెక్ట‌ర్‌గా తొలిసారి ఓ మ‌హిళ‌ను నియ‌మించారు. ఆమె పేరు గినా హాస్పెల్‌. గ‌త‌వార‌మే త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సిందిగా టిల‌ర్‌స‌న్‌కు ట్రంప్ సూచించారు. విదేశాంగ మంత్రిగా ఆయ‌న అందించిన సేవ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కొత్త‌గా ఈ శాఖ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న మైక్ పాంపియోపై ప్ర‌శంస‌లు కురిపించారు. చాన్నాళ్లుగా టిల‌ర్‌స‌న్‌తో ట్రంప్‌కు విభేదాలు ఉన్నాయి. ఉత్త‌ర కొరియాతో కీల‌క‌మైన చ‌ర్చ‌ల‌కు ముందు టిల‌ర్‌స‌న్‌ను త‌ప్పించ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని ట్రంప్ భావించారు.


3197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS