క‌శ్మీర్ అంశంపై వెన‌క్కి త‌గ్గిన ట్రంప్ !

Tue,August 13, 2019 11:18 AM

Donald Trump not to mediate on Kashmir issue, says Harsh Vardhan Shringla

హైద‌రాబాద్‌: క‌శ్మీర్ అంశంపై మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయ‌బోన‌ని డోనాల్డ్ ట్రంప్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని అమెరికాలోని భార‌తీయ దౌత్యాధికారి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ష్రింగ్లా తెలిపారు. క‌శ్మీర్ అంశం త‌న ఎజెండాలో లేద‌ని ట్రంప్ చెప్పిన‌ట్లు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవ‌ల జ‌పాన్‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో పాల్గొన్న ట్రంప్‌.. అక్క‌డ మోదీతో క‌శ్మీర్ అంశంపై మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఆ త‌ర్వాత ఇమ్రాన్‌తోనూ ఇదే విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో క‌శ్మీర్ అంశం ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అయితే భార‌త ప్ర‌భుత్వం తాజాగా ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేయ‌డంతో మ‌ళ్లీ క‌శ్మీర్ అంశం వివాదాస్ప‌దంగా మారింది.

భార‌త్‌, పాకిస్థాన్ దేశాలు క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ద్వైపాక్షికంగా చ‌ర్చించుకునే ఉంద‌న్న విష‌యాన్ని గౌర‌విస్తున్న‌ట్లు అమెరికా స్ప‌ష్టం చేసింది. భార‌త్‌, పాక్ అంగీక‌రిస్తేనే క‌శ్మీర్ అంశంపై మ‌ధ్య‌వ‌ర్తిగా వ‌స్తాన‌ని ట్రంప్ చెప్పారు, కానీ ఆ ఆఫ‌ర్‌ను ఇండియా ఆహ్వానించ‌లేద‌ని, దాంతో ఆ అంశాన్ని ట్రంప్ వ‌దిలేశార‌ని దౌత్యాధికారి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ చెప్పారు. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అత్యంత ఇష్ట‌మైన ఫాక్స్ న్యూస్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈవిష‌యాన్ని వెల్ల‌డించారు. రెండు దేశాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌ల‌ను ద్వైపాక్షికంగానే ప‌రిష్క‌రించుకోవాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర‌స్ తెలిపారు. ఇదే విష‌యాన్ని దౌత్య‌ధికారి త‌న వివ‌ర‌ణ‌లో తెలిపారు. ద్వైపాక్షిక అంశాల్లో థార్డ్‌పార్టీ జోక్యం ఉండ‌బోద‌న్నారు. ఇదే విష‌యాన్ని ట్రంప్ స్ప‌ష్టీక‌రించార‌న్నారు. క‌శ్మీర్ భ‌ద్ర‌త గురించి భార‌త ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చెప్పారు.

2940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles