మీ తప్పిదం వల్లే ఫ్లోరిడా ఘటన: ట్రంప్

Sun,February 18, 2018 01:34 PM

Donald Trump criticises FBI over handling of Florida school shooting suspect tip


వాషింగ్టన్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పార్క్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో ఉన్మాది నికోలస్ క్రూజ్ విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 17 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి పైగా విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బీఐపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ ఘటన జరగకముందే లభించిన కీలక ఆధారాలను కనుక పట్టించుకొని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ట్విటర్ ద్వారా ఆయన వ్యాఖ్యానించారు.

ఫ్లోరిడా స్కూల్‌లో కాల్పులు జరిపిన నిందితుడికి సంబంధించి అతడు ఇచ్చిన అన్ని సంకేతాలను ఎఫ్‌బీఐ మిస్ చేయడం చాలా విచారకరం. ఇది ఆమోదయోగ్యమైనది కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ట్రంప్ ప్రచారంలో రష్యా జోక్యం చేసుకుందనే విషయాన్ని నిర్ధారించడానికే ఎఫ్‌బీఐ ఆసక్తి కనబరుస్తూ ఎక్కువ సమయం కేటాయించింది. ఇందులో ఎలాంటి కట్ర లేదు. వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నించి మనమంతా గర్వపడేలా చేయండి అని ట్రంప్ ట్వీట్ చేశాడు.

ఒక వ్యక్తి కొంతమందిని చంపాలనే లక్ష్యంతో ఉన్నాడనే సమాచారం గతనెలలోనే ఎఫ్‌బీఐకి చేరింది. అయినప్పటికీ ఈ ఘటనపై దర్యాప్తు చేయడంలో కొంతమంది ఏజెంట్లు విఫలమయ్యారని ఏజెన్సీ వెల్లడించింది. ఈనేపథ్యంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిష్టోఫర్ వ్రే తన పదవికి రాజీనమా చేయాలని ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ రిక్ స్కాట్ డిమాండ్ చేశారు.

1248
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles