హిందువులకు తప్ప అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

Wed,November 14, 2018 01:36 PM

Donald Trump celebrates Diwali late and wishes all Indians except Hindus

వాషింగ్టన్: ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు దీపావళిని వారం రోజుల కిందటే జరుపుకున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఓ వారం ఆలస్యంగా ఇప్పుడు వైట్‌హౌజ్‌లో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. పోనీ అప్పుడైనా దివాలీ శుభాకాంక్షలను సరిగా చెప్పారా అంటే అదీ లేదు. తన ట్విటర్ వేదికగా అసలు ఈ పండుగ జరుపుకునే హిందువులకు తప్ప మిగతా అందరికీ ట్రంప్ పండుగ శుభాకాంక్షలు చెప్పడం విశేషం. అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా బుద్ధులు, సిక్కులు, జైనులు జరుపుకునే దీపాల పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని ట్రంప్ అన్నట్లు న్యూస్ ఏజెన్సీలు రాశాయి. అయితే అందులో హిందువులను మాత్రం మిస్ చేశారు. ట్రంప్ కూడా దాన్ని అలాగే ట్వీట్ చేశారు.


అయితే కొద్ది సేపటి వరకు ఆ ట్వీట్ అలాగే ఉంది. అందులో ట్రంప్ ఎలాంటి మార్పులు చేయలేదు. సుమారు 20 నిమిషాల తర్వాత ఎవరో గుర్తు చేసినట్లున్నారు. దీంతో అప్పుడాయన హిందువుల పండుగ అంటూ మరో ట్వీట్ చేశారు.

3241
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles