కుక్క విశ్వాసం.. ఓనర్ వీల్‌చెయిర్‌ను నెట్టుతూ.. వీడియో

Fri,July 20, 2018 03:30 PM

Dog pushes paralysed owner wheelchair in heartwarming video

కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. వాళ్లు ఊరికనే అనలేదు.. అని నిరూపించింది ఈ శునకం. ఓ కుక్క పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో వీల్‌చైర్‌పై ఉన్న తన ఓనర్‌ను రోడ్డు మీద తన తలతో నెట్టుతూ తీసుకెళ్తుంటుంది. ఆ ఘటనను కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.


ఈ ఘటన ఫిలిప్పైన్స్‌లో చోటు చేసుకున్నది. ప్రతి రోజు ఆ కుక్కకు అదే దినచర్య. తన ఓనర్ ఎక్కడికి వెళ్లాలన్నా దాని తోడు కావాల్సిందే. ఆ కుక్కే అతడిని వీల్ చైర్ నెడుతూ తీసుకెళ్తుంది. ఇదివరకు చాలా సార్లు ఆ కుక్క అలా వీల్‌చైర్‌ను నెట్టుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

3065
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS