ముక్కులో నుంచి జలగను బయటకు తీశారు.. వీడియో

Mon,June 11, 2018 01:22 PM

Doctor removed a giant Leech from a mans nose in China Video goes viral

బీజింగ్: చైనాలో ఓ వ్యక్తికి వారం రోజులుగా ముక్కులో నుంచి రక్తం బయటకు వస్తున్నది. సాధారణంగా వేడి చేసినపుడు మనకు ఇలా జరుగుతుంది. అతనూ అలాగే అనుకొని హాస్పిటల్‌కు వెళ్లకుండా ఉండిపోయాడు. ఎంతకీ రక్తం ఆగకపోవడంతో డాక్టర్‌కు దగ్గరికి వెళ్లాడు. వెంటనే అతని ముక్కును పరిశీలించిన డాక్టర్ షాక్ తిన్నాడు. రక్తాన్ని పీల్చే జలగ అతని ముక్కులో చేరినట్లు గుర్తించాడు. వెంటనే దానిని బయటకు తీశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

నిజానికి అతని భార్య ముక్కులో ఏదో ఉన్నట్లుగా గమనించింది. ఒకసారి బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్లినట్లుగా ఆమె చెప్పడంతో అతను డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. అదో జలగ అని డాక్టర్ చూడగానే చెప్పేశాడు. అంత పెద్ద జలగను డాక్టర్ తీసి చూపించినా ఆ వ్యక్తి మాత్రం ఎలాంటి ఫీలింగ్‌లో లేకుండా కామ్ కూర్చోవడం విశేషం. నాలుగు అంగుళాల పొడవున్న జలగ ఇది. రెండు రోజుల్లోనే ఈ వీడియోను 12 లక్షల మంది చూశారు.

పంట పొలాల్లో పని చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న చెరువులోని నీటిని తాగినపుడు అది అతని నోటిలోకి వెళ్లి ఉంటుందని, అక్కడి నుంచి ముక్కులోకి చేరి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అతని నోట్లోకి వెళ్లినపుడు అది కేవలం ఓ వెంట్రుక మందంలో మాత్రమే ఉండొచ్చని, తర్వాత రక్తం పీల్చుకొని భారీగా పెరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే అంత పెద్ద జలగ అతని ముక్కులో ఉన్నా.. అతను మాత్రం అన్ని రోజులుగా ఎందుకు గుర్తించలేకపోయాడన్నది మాత్రం అంతుబట్టలేదు.

5632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles