మీకేమైనా సౌండ్ వినిపించిందా?

Wed,December 6, 2017 05:12 PM

Do you hear any sound from this GIF?

ఏంటా అర్థం పర్థం లేని టైటిల్ అని విసుక్కోకండి. దాంట్లో ఓ లాజిక్ ఉంది. ఇప్పుడు మీరు పైన ఓ ఫోటో చూశారుగా.. ఏముంది అందులో. ఎలక్ట్రిక్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా. సరే. ఇప్పుడు కింద దానికి సంబంధించిన ఓ జీఐఎఫ్ షేర్ చేస్తాము. దాని ఓసారి ప్రశాంతంగా చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం.చూశారా. ఇప్పుడు చెప్పండి.. ఏదైనా సౌండ్ వినిపించిందా మీకు. లేదా.. జాగ్రత్తగా గమనించారా? అయినా వినిపించట్లేదా. అదేంటి.. మరి కొంతమంది ఎలక్ట్రిక్ పోల్ కింద పడుతున్నప్పుడు భూమి అదిరిన సౌండ్, గుండె అదిరిన సౌండ్ వినిపిస్తుందంటున్నారే. మరోసారి ట్రై చేయండి. మీకు కూడా అటువంటి సౌండే వినిపిస్తుందా? ఈ జీఐఎఫ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ అయిపోయింది. అంతే కాదు... కొంతమంది అది మనిషి హార్ట్ బీట్ అని అంటున్నారు. మరి కొంతమంది మాత్రం ఏ సౌండ్ వినిపించట్లేదని కామెంట్లు చేస్తున్నారు. దానిపై స‌ర్వేలు కూడా నిర్వ‌హిస్తున్నారు. ఏదో ఫన్ కోసం గ్లాస్గో యూనివర్సిటీలో చదివే సైకాలజీ రీసెర్చర్ ఈ యానిమేషన్‌ను రూపొందించింది. అయితే.. ఆమె క్రియేటివిటీని నచ్చిన నెటిజన్లు ఆ జీఐఎఫ్‌ను తెగ షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.4149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS