తెలుపు కాదు.. బ్రిటీషర్లు నలుపేనట..

Thu,February 8, 2018 04:54 PM

DNA shows first modern Briton had dark skin, blue eyes

లండన్ : బ్రిటీషర్లంటే శ్వేతజాతీయులు. కానీ వాళ్లు తెలుపు కాదు, ఒకప్పుడే నలుపేనట. సుమారు పదివేల ఏళ్ల క్రితం బ్రిటీషర్ల చర్మం ఛామన ఛాయ వర్ణంలోనే ఉండేదని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వాళ్లకు నలుపు రంగు, నీలి కండ్లు ఉన్నట్లు తాజాగా డీఎన్‌ఏ విశ్లేషణ ద్వారా లండన్ సైంటిస్టులు తెలిపారు. 1903లో ఇంగ్లండ్‌లోని ఓ గుహలో ఓ వ్యక్తి అవశేషాలు దొరికాయి. అతన్ని చద్దార్ మ్యాన్‌గా గుర్తించారు. అంటే ఆ మానవ కళేబరం సుమారు 10 వేల ఏళ్ల క్రితం నాటిది. ఆ పురాతన కాలం నాటి మనిషికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. దాన్ని విశ్లేషించిన సైంటిస్టులు ఈ వాస్తవాన్ని తెలియజేశారు. చద్దార్ మ్యాన్ పుర్రెకు 2మిల్లీమీటర్ల రంధ్రం చేసి ఎముక పౌడరను తీశారు. ఆ పౌడర్‌ను బ్రిటన్‌కు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం,యూనిరవ్సిటీ కాలేజీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

2149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS