బెర్ముడా ట్రయాంగిల్‌లో వింత నిర్మాణం.. ఏలియన్లదేనా?

Fri,August 10, 2018 08:17 AM

Discovery Channel Explorer Darrel Miklos discovered an Alien Object in Bermuda Triangle

న్యూయార్క్: బెర్ముడా ట్రయాంగిల్.. ఇప్పటికీ దీని రహస్యాన్ని ఛేదించలేక శాస్త్రవేత్తలు తలపట్టుకుంటున్నారు. బెర్ముడా సమీపంలో 5 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ అంతుచిక్కని ప్రాంతంలో లెక్కలేనన్ని నౌకలు, విమానాలు అదృశ్యమైపోయాయి. దీనికి ఆ ప్రాంతంలో ఉండే రాకాసి అలలతోపాటు అన్ని వైపుల నుంచి దాడి చేసే తుఫాన్లే కారణమని ఈ మధ్యే చానెల్ 5 ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఇంతకు మించి అక్కడ రహస్యమేమీ లేదని కూడా తేల్చేశారు పలువురు శాస్త్రవేత్తలు.

అయితే వాళ్లకు ఇప్పుడు మరో సవాలు ఎదురైంది. డిస్కవరీ చానెల్‌కు చెందిన అన్వేషకుడు డారెల్ మిక్లోస్.. బెర్ముడా ట్రయాంగిల్‌లో ఓ వింతయిన నిర్మాణాన్ని కనిపెట్టారు. కరీబియన్ ప్రాంతంలో సముద్రంలో మునిగి పోయిన నౌకల శిథిలాల కోసం వెతుకుతున్న మిక్లోస్‌కు ఈ భారీ నిర్మాణం కనిపించింది. ఇప్పటివరకు మానవాళి ఎన్నడూ చూడని వింతయిన, భారీ నిర్మాణం ఇదని.. తన అన్వేషణ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తుందని మిక్లోస్ అన్నారు.

బెర్ముడా ట్రయాంగిల్‌లో బహమాస్‌కు సమీపంలో ఈ భారీ యూఎస్‌వో (అన్‌ఐడెంటిఫైడ్ సబ్‌మెర్జ్‌డ్ ఆబ్జెక్ట్)ను మిక్లోస్, ఆయన టీమ్ గుర్తించింది. క్షితిజ సమాంతర నిర్మాణాలతో చూడటానికి చాలా వింతగా ఉందని మిక్లోస్ వెల్లడించారు. ఒక్కో నిర్మాణం దాదాపు 300 అడుగుల వరకు ఉందని కూడా ఆయన చెప్పారు. అంటే దాదాపు ఒక్కోటి ఒక్కో ఫుట్‌బాల్ మైదానమంత పొడవు ఉండటం విశేషం. నేను ఇలాంటి నిర్మాణాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇవి కచ్చితంగా నౌకల శిథిలాలైతే కాదు. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. మన ప్రకృతి రూపొందించిన వాటికి కూడా పూర్తి భిన్నంగా ఉన్నాయని మిక్లోస్ చెప్పారు.

ఈ నిర్మాణంపై పగడపు దిబ్బలు ఏర్పడ్డాయి. వీటిని పరిశీలించిన జియో ఫిజిసిస్టులు అవి 5 వేల ఏళ్ల కిందటే ఏర్పడినట్లు స్పష్టంచేశారు. అయితే తీవ్రమైన ప్రవాహాలు ఉండే ఈ ప్రాంతంలో పగడపు దిబ్బలు పెరగడమే అసాధ్యమని గతంలో శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రపంచంలో ఎక్కడా పగడపు దిబ్బలు ఇక్కడున్నట్లుగా సహజంగా పెరగవని, వీటి వృద్ధికి కచ్చితంగా అంతర్లీనంగా ఓ నిర్మాణం ఉండొచ్చని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. 600 అడుగుల మేర ఈ నిర్మాణం వ్యాపించి ఉంది. ఈ నిర్మాణానికి కూడా అయస్కాంత క్రమ విరుద్ధత ఉన్నట్లు గుర్తించారు. కరీబియన్ ప్రాంతంలో ఉన్న 99 అయస్కాంత క్రమ విరుద్ధ ప్రాంతాల్లో ఇదీ ఒకటి. నిజానికి ఈ అన్ని ప్రాంతాల మ్యాప్‌ను మిక్లోస్ స్నేహితుడు, ప్రముఖ నాసా ఆస్ట్రోనాట్ గోర్డన్ కూపర్ 1960ల్లోనే రూపొందించారు.

3383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS