క‌శ్మీర్‌పై ఐక్యరాజ్య‌స‌మితి ఆందోళ‌న‌

Mon,September 9, 2019 04:10 PM

Deeply concerned, says UN Rights Chief Michelle Bachelet On Kashmir

హైద‌రాబాద్‌: క‌శ్మీర్‌లో నెల‌కొన్న ప‌రిస్థితిపై ఐక్య‌రాజ్య‌స‌మితి ఇవాళ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత అక్క‌డ గ‌త 35 రోజులుగా ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. దీన్ని ఖండిస్తూ యూఎన్ ప్ర‌క‌ట‌న చేసింది. జ‌నీవాలో ఐక్య‌రాజ్య‌స‌మితి మాన‌వ హ‌క్కుల మండ‌లి ఇవాళ 42వ స‌మావేశాల‌ను ఏర్పాటు చేసింది. మండ‌లి అధ్య‌క్షుడు మిచ్చెల్లీ బాచ‌లెట్ దీనిపై స్పందించారు. క‌శ్మీర్‌లో ప్ర‌స్తుతం ఉన్న మాన‌వ హ‌క్కుల ప‌రిస్థితిపై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. ఇంట‌ర్నెట్ సేవ‌ల ర‌ద్దును కూడా ఖండించింది. ప్ర‌ముఖ నేత‌ల గృహ‌నిర్బంధాన్ని కూడా యూఎన్ ప్ర‌శ్నించింది. క‌శ్మీర్‌లో మాన‌వ హ‌క్కులను గౌర‌వించాల‌ని ఆయ‌న త‌న ప్ర‌సంగంలో భార‌త్‌, పాక్ ప్ర‌భుత్వాల‌ను కోరారు. ప్ర‌భుత్వం నిర్ణ‌యాల్లో క‌శ్మీర్ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించాల‌న్నారు. అస్సాంలో ఎన్ఆర్‌సీ చేప‌ట్టిన ప్ర‌క్రియ‌పైన కూడా యూఎన్ ఆందోళ‌న వ్య‌క్త‌ప‌రిచింది.

2444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles